ASR: అనంతగిరి, అరకు మండలాల్లో బుధవారం డీఎంహెచ్వో డాక్టర్ టీ.విశ్వేశ్వరనాయుడు పర్యటించారు. అనంతగిరి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం, అరకు మండలంలోని సుంకరమెట్ట ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రుల్లో జరుగుతున్న సుఖ ప్రసవాల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల పరిధిలో నమోదైన మలేరియా కేసుల గురించి, చికిత్స గురించి ఆరా తీశారు.