MBNR: ప్రజలకు సుంచి శుభ్రత నేర్పిన వ్యక్తులు రజకులని ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఛైర్మన్ పసుల రాజు అన్నారు. చాకలి ఐలమ్మ వర్ధంతి పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ వద్ద ఆమె విగ్రహానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఐలమ్మ పోరాడారన్నారు.