HNK: పరకాల పట్టణ కేంద్రంలో బుధవారం 1 వార్డుకు చెందిన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ సుష్మ, మార్కెట్ ఛైర్మన్ రాజిరెడ్డి మంజూరు పత్రాలను అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో నియమ నిబంధనలు పాటించి, పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.