SKLM: ఆమదాలవలస నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ. 2.32 కోట్లు విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కూన రవి కుమార్ కార్యాలయం బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు 24 పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మరమ్మతులు, ఇతర సౌకర్యాల కోసం ఈ నిధులు వినియోగించనున్నట్లు ఎమ్మెల్యే రవికుమార్ తెలిపారు.