SRD: మనూరు మండలం బాధలగాం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లను ఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంతింటి కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. సకాలంలోని ఇళ్లు నిర్మించుకుని, ప్రభుత్వం అందిస్తున్న రూ. 5 లక్షల సహాయాన్ని పొందాలని ఆయన సూచించారు.