AP: రాయలసీమ రాళ్ల సీమ కాదు.. రతనాల సీమ అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రాభివృద్ధి కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం. మా సంకల్పానికి ప్రధాని మోదీ అండగా ఉన్నారు. TDP, జనసేన, BJP కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని తిరిగేలా పాలిస్తున్నాం. మళ్లీ వైకుంఠపాళీ వద్దు. కూటమి ప్రభుత్వం శాశ్వతంగా ఉంటే.. అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతోంది. నా చివరి శ్వాస వరకు కష్టపడుతాను’ అని అన్నారు.