KMR: జిల్లా కేంద్రంలో బుధవారం అరగంటకు పైగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెరువుల్లోకి వర్షపు నీరు చేరి పొంగిపొర్లుతున్నాయి. బతుకమ్మ కుంట, జీఆర్ కాలనీ వంటి ప్రాంతాల్లో నీరు చేరడంతో, ఇదే పరిస్థితి కొనసాగితే ఇళ్లలోకి నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.