బాపట్ల జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్గా వెంకటరమణ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన కలెక్టర్ వెంకట మురళిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకట మురళి ఆయనకు అభినందనలు తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావం తో పనిచేసే పౌర సంబంధాల శాఖకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ మురళి సూచించారు.