NLR: నెల్లూరు నగరపాలక సంస్థకు చెందిన సర్వే నెంబర్ 2954/4, సర్వేపల్లి బిట్ – 2 గ్రామం, వెంకటాచలం మండలం ప్రాంతంలోని 20 ఎకరాల స్థలంలో మట్టి తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ నందన్ బుధవారం హెచ్చరించారు. ఆ స్థలంలో ఎవరైనా మట్టి తవ్వకాలు జరుపుతున్నట్లయితే 0861-2356177 నెంబర్ను సంప్రదించాలన్నారు.