VSP: కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు చేపట్టిన రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర బుధవారం విశాఖకు చేరుకుంది. ఎస్సీ సంఘాలు పాదయాత్రకు స్వాగతం పలికాయి. నగరంలో సరస్వతి పార్క్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మాజీ మంత్రి చింత మోహన్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రమాదంలో పడిందన్నారు. దానిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.