AKP: అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 50 వేల ఎకరాలకు సాగునీటినందించే తాండవ రిజర్వాయర్ నీటిమట్టం బుధవారం సాయంత్రానికి 375.30 అడుగులు ఉన్నట్లు ప్రాజెక్ట్ జేఈ శ్యాం కుమార్ తెలిపారు. దీని గరిష్ట స్థాయి నీటిమట్టం 380 అడుగులుగా పేర్కొన్నారు. గత నెల పదవ తేదీ నుంచి ఆయకట్టు భూములకు సాగునీటిని అందిస్తున్నా వర్షాలు కురుస్తుండడంతో రిజర్వాయర్లో నీటిమట్టం తగ్గలేదన్నారు.