KMR: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరే విద్యార్థులు ఈ నెల 12 వరకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం నేడు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఎక్కడైనా అడ్మిషన్ పొందవచ్చన్నారు.