GNTR: నేపాల్ రాజధాని ఖాట్మండులో యాత్రికులపై ఆందోళన కారులు దాడులు చేసిన సంగతి విధితమే. దీంతో యాత్రికులు ఎక్కడిక్కడ చిక్కుకుపోయారు. వారిలో మంగళగిరికి చెందిన 8 మంది ఉన్నట్లు బుధవారం అధికారులు తెలిపారు. వారిలో మాచర్ల హేమసుంధరరావు, వెంకట నాగకుమారి, గోలి వరధరాజు, రమా జ్యోతి, చింత్రక్రింది కేంద్ర ప్రసాద్, పద్మావతి, దామర్ల శివరామకృష్ణ, నాగలక్ష్మీ ఉన్నారు.