అన్నమయ్య: తంబళ్లపల్లె జేసీజే కోర్టు ఉద్యోగి కేశవరెడ్డి అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆసుపత్రిలో బుధవారం సాయంత్రం మృతి చెందారు. కేశవ రెడ్డి మూడేళ్లుగా తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ మేరకు కేశవ రెడ్డి మృతికి న్యాయాధికారి, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, లోక్ అదాలత్ సిబ్బంది సంతాపం తెలిపారు.