KDP: ప్రొద్దుటూరు గాంధీ రోడ్డులోని మడూరు డ్రైనేజీ కాలువలో పడిపోయిన ఆవును గురువారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. ఈ మేరకు రాత్రి వర్షానికి ప్రమాదవశాత్తు ఆవు కాలువలో పడిపోయింది. ఉదయం గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. దీంతో జిల్లా అగ్నిమాపక శాఖ సహాయ అధికారి బుస్సీ రెడ్డి ఆదేశాలతో అగ్నిమాపక సిబ్బంది ఆవును బయటికి తీశారు.