టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఇటీవల జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల అతడు ఉన్నట్టుండి ఆసుపత్రి వద్ద కన్పించడంతో అభిమానులు మరింత ఆందోళన చెందారు. ఈ క్రమంలోనే హిట్‌మ్యాన్ తాజా పోస్ట్ వైరల్ అవుతోంది. ట్రైనింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటోను రోహిత్ షేర్ చేశాడు. దీంతో రిటైర్మెంట్ ఊహాగానాలకు ఒక్క ఫొటోతో చెక్ పెట్టినట్లు అయింది.