NLG: నకిరేకల్‌కు చెందిన గోపగాని ఎల్లేష్, శిరీష పాత సామాను అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. శిరీష కిడ్నీ వ్యాధితో ఇటీవల మరణించింది, ఆ ముగ్గురు ఆడపిల్లలు దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను తన నివాసంలో వారు కలవగా.. అ పిల్లలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.