HYD: బీజేపీలోకి త్వరలో భారీ చేరికలు ఉంటాయని రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అన్నారు. HYD నాంపల్లి పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోక్ సత్తా నాయకులు శ్రీనివాస్ వర్మ, మరికొంత మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. సందర్భంగా వారందరికీ కాషాయ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు. అనంతరం ప్రెసిడెంట్ ప్రసంగించారు.