W.G: మొగల్తూరు గ్రామ దేవత నడివీధి ముత్యాలమ్మ పూరిగుడి దగ్ధం కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. దీని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్సై జి.వాసు బుధవారం తెలిపారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న దుకాణాలు, ఇతర ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను సేకరించి పరిశీలిస్తున్నారు.