దులీప్ ట్రోఫీలో తుది సమరానికి రంగం సిద్ధమైంది. టైటిల్ కోసం బెంగళూరులో సౌత్ జోన్, సెంట్రల్ జోన్ ఇవాళ్టి నుంచి అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెంట్రల్‌కు రజత్ పాటీదార్ నాయకత్వం వహిస్తుండగా.. సౌత్‌ను మహ్మద్ అజహరుద్దీన్ నడిపించనున్నాడు. సౌత్ జట్టులో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లు ఐదుగురు ఉన్నారు.