E.G: రాజానగరం మండలం దివాన్ చెరువుకు చెందిన సూక్ష్మ కళాకారుడు బబ్లు ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్’లో స్థానం సంపాదించాడు. 5 లక్షల బియ్యం గింజలతో ప్రేమానంద్ మహారాజ్ చిత్రాన్ని వేసి ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఇప్పటికే 2 లక్షల ధాన్యం గింజలతో బాలాజీ చిత్రాన్ని వేసి ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లోనూ చోటు దక్కించుకున్నాడు. పలువురు అభినందించారు.