GDWL: గట్టు మండలం చిన్నోనిపల్లిలోని R&R సెంటర్లో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను బుధవారం అధికారులు పరిశీలించారు. ఎంపీవో రవికుమార్, హౌసింగ్ ఏఈ అనిల్ కుమార్, పంచాయతీ కార్యదర్శి లక్ష్మణ్, మాజీ ఎంపీపీ విజయ్ కుమార్తో కలిసి ఈ పనులను పరిశీలించారు. అనంతరం అధికారులు మాట్లాడుతూ.. చిన్నోనిపల్లి గ్రామానికి మొత్తం 132 ఇళ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు.