KDP: నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతుందని కలెక్టర్ శ్రీధర్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. నేపాల్లో ఉన్న ఏపీ వాసుల కోసం రాష్ట్ర ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసిందన్నారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ప్రాంగణంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.