ATP: ఉరవకొండ మండలంలో విషాద ఘటన జరిగింది. మైలారంపల్లికి చెందిన 7 నెలల గర్భిణి మౌనిక ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల వివరాల మేరకు.. భర్త హనుమంతు వేధింపులతోనే మౌనిక ఉరేసుకుని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.