KDP: పులివెందులలో ఒక ఆటోడ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. ఇవాళ పులివెందులకు చెందిన గాయత్రి భర్త పవన్ కుమార్ రెడ్డి పోస్ట్ ఆఫీస్ నుంచి రూ. 20 వేలు డబ్బులు డ్రా చేసి ఇంటికెళ్లే క్రమంలో డబ్బు కవర్ పోగొట్టుకున్నారు. ఈ కవరు గమనించిన ఆటో డ్రైవర్ దేవ దత్తయ్య కవరులో ఉన్న ఐడీప్రూఫ్ సహాయముతో ఆమెను గుర్తించి, కానిస్టేబుల్ రాజు సమక్షంలో వారికి అందజేశారు.