KDP: తొండూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ అరీఫుల్లా ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమన్నిఇవాళ డాక్టర్ రేష్మా నిర్వహించారు. గర్భవతులకు గర్భస్థ పరీక్షలు, రక్తపోటు, మధుమేహం, కామెర్లు, హీమోగ్లోబిన్ పరీక్షలు చేశారు. ప్రమాదకర స్థితిలో ఉన్న గర్భవతులను ఉన్నత ఆసుపత్రులకు రిఫరల్ చేశారు.