SRD: జిల్లాను ముందు వరుసలో ఉంచేలా పోలీసు అధికారులు, సిబ్బంది కృషి చేయాలని ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. నేరాల రేటు తగ్గేలా పోలీసులు అంకిత భావంతో పనిచేయాలన్నారు. డయల్ 100కు వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.