KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాల, శ్రీ శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో “వర్తమానంలో మన నడవడి – మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది” అనే అంశంపై డిగ్రీ విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ మాట్లాడుతూ.. ప్రతి దేశ భవిష్యత్తు ఆ దేశ యువత చేతుల్లోనే ఉంటుందని పేర్కొన్నారు.