ADB: సీఎంఆర్ఎఫ్తో పేద ప్రజలకు ఆర్థిక భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో చేపట్టిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో బుధవారం ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గంలోని 41 మంది లబ్ధిదారులకు రూ. 9 లక్షల 57 వేల విలువగల CMRF చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు.