ఆసియా కప్‌లో భాగంగా గ్రూప్-Aలో తొలి మ్యాచ్ భారత్, యూఏఈ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియాతో జరిగిన ఏకైక T20 మ్యాచ్‌లో యూఏఈ ఓడిపోయింది. దీంతో టోర్నీలో ఫేవరెట్‌గా ఉన్న భారత్‌కు యూఏఈ ఏ మేరకు పోటీ ఇస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.