MDK: నర్సాపూర్ పట్టణ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ నిర్మూలనపై బుధవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను, వాటి నివారణ మార్గాలను తెలియజేస్తూ విద్యార్థులు స్ట్రీట్ నాటకాలు, ప్లకార్డుల రూపంలో ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ మేనేజర్ మధుసూదన్, సానిటరీ ఇన్స్పెక్టర్ మహేష్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.