CTR: పట్టణంలోని DRDA మీటింగ్ హాలులో ఇవాళ కొరమీను చేపల పెంపకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 5 మండలాలకు చెందిన మహిళా రైతులు హాజరయ్యారు. మహిళా సభ్యులకు కనీసం 5 సెంట్లు భూమి, బోరుబావి ఉంటే అర్హులని చెప్పారు. అర్హులకు ఉదయ్ ఆక్వా సంస్థ నుంచి కొరమీను చేప పిల్లలు, షెడ్డు, ఫాం పాండు, యంత్ర పరికరాలు, PMEGP ద్వారా 35% సబ్సిడీ సమకూర్చుతామన్నారు.