AP: సైబర్ నేరగాళ్లు ఏకంగా కాకినాడ ఎంపీ సిబ్బందికే టోకరా వేశారు. వాట్సాప్‌లో MP డీపీ పెట్టి డబ్బులు వసూలు చేశారు. MP పేరు చెప్పి 11 సార్లు మొత్తం రూ.92 లక్షలు వసూలు చేశారు. ఎంపీ డీపీతో డబ్బులు పంపాలంటూ సీఎఫ్‌వో శ్రీనివాస్‌కు మెసేజ్‌లు పంపారు. ఎంపీ అడిగారని సీఎఫ్‌వో డబ్బులు పంపారు. ఇటీవల శ్రీనివాస్, ఎంపీ కలుసుకోవడంతో మోసం వెలుగులోకి వచ్చింది.