ADB: భీంపూర్ మండలంలోని గిర్గాం, అర్లి గ్రామాల్లో ఆరోగ్య సిబ్బంది బుధవారం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని గర్భిణీ స్త్రీలు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు వ్యాధి నిరోధక టీకాలను అందజేసినట్లు డా. నిఖిల్ రాజ్ తెలిపారు. సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు.