కృష్ణా: గన్నవరం నియోజకవర్గంలో ఎరువుల కొరత లేదని MLA యార్లగడ్డ వెంకట్రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. పురుషోత్తపట్నంలో యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్న సమస్యపై వెంటనే అధికారులతో ఫోన్లో పరిష్కారం కోరారు. కలెక్టర్ డీకే బాలాజీ పర్యటనలో గ్రామాల్లో ఎరువుల సరఫరా, వినియోగంపై ఫీడ్బ్యాక్ తీసుకుని అధికారులు వ్యవసాయ అవసరాలకు సరిపడా ఎరువులు అందించాలని ఆదేశించారు.