NZB: బోధన్‌లో ఉగ్రవాదుల కలకలం రేగింది. పట్టణంలోని అనీస్ నగస్ నగర్‌కు చెందిన వ్యక్తిని బుధవారం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ఒక గన్ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో రోహింగ్యాల, నకిలీ పాస్‌పోర్టుల ఉదంతాలున్న బోధన్‌లో ఇప్పుడు ఈ సంఘటన ఆందోళన కలిగించింది. నిందితుడిని పోలీసులు బోధన్ కోర్టులో హాజరుపరిచామని తెలిపారు.