W.G: నరసాపురంలోని 19వ వార్డు రాయపేటలో బాలికల హాస్టల్ వద్ద బుధవారం ఓ చెట్టు కొమ్మ విరిగి రోడ్డుపై పడింది. ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. పలు కళాశాలలు, స్కూల్స్‌కి వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి భారీగా పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించాలని కోరుతున్నారు.