యోగివేమన విశ్వవిద్యాలయం జాతీయ సేవా పథకం 3, 4 యూనిట్ల ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ కె. లలిత, డా.యస్. సునీత ఆధ్వర్యంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫసర్ పి. పద్మ మాట్లాడుతూ.. క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకోవడం దేశానికే తీరని నష్టమని, ఇది అత్యంత కఠినమైన నిర్ణయం అని తెలిపారు.