PDPL: పెద్దపల్లి జిల్లాలో 2027 గోదావరి పుష్కరాల కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని స్నాన ఘాట్ల మరమ్మతులు, కొత్త ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. కొత్తగా సురబండేశ్వర, గోలివాడ ఘాట్ల పునర్నిర్మాణం చేపట్టాలన్నారు.