SRCL: తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలో బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు పుట్టగొడుగుల పెంపకంపై రైతులకు బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేట్ డీన్ రజియా సుల్తానా మాట్లాడుతూ.. పుట్టగొడుగుల పెంపకం ద్వారా యువతకు మహిళలకు స్వయం ఉపాధి దొరుకుతుందని వివరించారు. అలాగే అదనపు ఆదాయం కూడా అర్జించవచ్చని పేర్కొన్నారు.