ELR: నూజివీడులో ఎస్ఆర్ఆర్ బాయ్స్ జడ్పీ హైస్కూల్ ఆవరణలో విద్యార్థులకు బుధవారం మత్తు పదార్థాల అనర్ధాలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సామాజికవేత్త సుందర్ రావు మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని, జీవితాన్ని వృథా చేసుకోవద్దని వివరించారు. క్రమశిక్షణతో చదువుకొని, పౌష్టికాహారం తీసుకోవడంతో బంగారు భవితకు బాటలు వేసుకోవాలన్నారు.