ATP: పేరూరు, భైరవాని తిప్ప ప్రాజెక్టులు జిల్లాకు జీవనాడుల్లాంటివని ఎమ్మెల్యే పరిటాల సునీత తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయాలని సూపర్ హిట్ సభా వేదిక నుంచి సీఎం చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తిచేసి ఈ ప్రాంతానికి నీరు ఇస్తున్నందుకు ఎమ్మెల్యే సునీత, ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.