ADB: శిశు మరణాలను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కలెక్టర్ రాజార్షి షా అన్నారు. బుధవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నవజాత శిశు మరణాలపై వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో శిశు మరణాలు జరగకుండా సమగ్ర ప్రణాళికలను రూపొందించాలన్నారు. తల్లిపాల ఆవశ్యకతపై బాలింతలతో పాటు మహిళలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.