TG: గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. అయిజ మండలం భూంపురం గ్రామంలో పొలంలో పిడుగుపడి ముగ్గురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒకరు యువకుడు ఉన్నాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మరోవైపు ఖమ్మం జిల్లాలో పొలంలో ఓ రైతు ఫోన్ మాట్లాడుతుండగా.. పిడుగుపడి అతను చనిపోయాడు.