NLG: చిట్యాల మండలం వెలిమినేడు, నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డి గూడ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలను విద్యాశాఖ RJD విజయలక్ష్మి బుధవారం డీఈవో బిక్షపతితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థుల అకడమిక్ ప్రోగ్రెస్ను పరిశీలించి సంతృప్తి వ్యక్తపరిచారు. అనంతరం నార్కెట్పల్లి మండలంలోని స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.