VZM: రైతులకు తగినంత యూరియా అందుబాటులో ఉందని, పంపిణీ కూడా సక్రమంగా జరుగుతోందని కలెక్టర్ అంబేద్కర్ తెలిపారు. యూరియా సరఫరాలో సమస్యలు తగ్గాయని, డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి ఫోన్ చేసేవారి సంఖ్య కూడా తగ్గిందన్నారు. అందువల్ల డయిల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని గురువారం నుంచి తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు.