MBNR: హన్వాడ మండలం కృష్ణంపల్లి తండాలో దాదాపు 10 ఇళ్లు ఇటీవల కురిసిన వర్షాలకు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో తార్ఫాలిన్ కవర్లను ఆ ఇళ్ల యజమానులకు బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ యువ నాయకులు అనిల్ రాథోడ్ మాట్లాడుతూ.. ఇబ్బందికర పరిస్థితులలో రెడ్ క్రాస్ చేయూతని ఇవ్వడం సంతోషకరమన్నారు.