VZM: ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా విజయనగరం ప్రభుత్వ వైద్య కళాశాల మానసిక విభాగం ఆధ్వర్యంలో మహారాజ ప్రభుత్వ బోధనాసుపత్రి ప్రాంగణంలో అవగాహన ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ బి. దేవి మాధవి మాట్లాడుతూ.. “ప్రతి జీవితం విలువైనది, ఆత్మహత్యలను నివారించడం అందరి బాధ్యత” అని తెలిపారు.