KDP: పెద్దముడియం మండలంలో 3000 ఎకరాలలో రైతులు పంట సాగు చేస్తున్నట్టు ఏవో జాకీర్ షరీఫ్ తెలిపారు. మండలంలో ప్రధానంగా మొక్క జొన్న 1000 ఎకరాలు, కంది 600 నుంచి 1000, పత్తి 200, వేరుశనగ 100, మినుము 300 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారని చెప్పారు. యూరియాను ఎకరాకు 50 కేజీలు ఎక్కువగా వాడుతున్నారని, దీని వల్ల భూమి, నీరు, గాలి కలుషితం అవుతాదన్నారు.