ప్రకాశం: కనిగిరి ఆర్టీసీ డిపో అభివృద్ధికి నిధులు మంజూరు చెయ్యాలని మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారక తిరుమలరావును కోరారు. డిపో చాలా పురాతనమైనందున ఆదాయంలో వచ్చే డిపోలల్లో అగ్రస్థానంలో ఉందని ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన తిరుపతి, శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు నడపాలని వినతి పత్రాన్ని అందజేశారు.